భగవద్గిత శ్లోకం - Day 01 - భక్తి యోగము

భక్తి యోగము -
అర్జున ఉవాచ :-

ఏవం సతత యుక్తా యే భక్తాస్త్వామ్ పర్యుపాసతే
యే చాప్యక్షరమవ్యక్తం తేషాo కే యోగవిత్త మాః .
అర్థం :
భగవానుని విశ్వరూపమునుగాని , లేక దైవ సంబంధమైన వేఱోక మూ ర్తి ని గానీ , సాకార స్వరూపమునుగాని , అనవరత భక్తితో , ఉపాసించువారు ( సగుణోపాసకులు ) గొప్పా ? లేక
ఇంద్రియములకు గోచరముకాని , నిరాకారమైన , సర్వవ్యాపకమైన , అక్షర పరమాత్మను ధ్యానించువారు (నిర్గుణోపాసకులు) గొప్పా ?అని అర్జునుని ప్రశ్న ఇదివఱలో అనేక తూర్లుభగవానుడు నిర్గుణపరమాత్మయొక్క తత్వమునుగూర్చి , ధ్యానమును గూర్చి తెలిపియుండెను . ఇప్పుడు విశ్వరూపమునుజూపి , సగుణోపాసనను బలపఱచెను .

Comments

Popular posts from this blog

భగవద్గిత శ్లోకం - Day 02 - భక్తి యోగము

భగవద్గిత శ్లోకం - Day 04 - భక్తి యోగము

భగవద్గిత శ్లోకం - Day 03 - భక్తి యోగము