భగవద్గిత శ్లోకం - Day 03 - భక్తి యోగము
భక్తి యోగము :
సర్వత్ర గమ చిన్త్యం చ కూటస్థ మచలం ధ్రువం.
4. సంనియ మ్యేన్ద్రి యగ్రామం సర్వత్ర సమబుద్ధయః
తే ప్రాప్నువన్తి మాయేవ సర్వభూత హితే రతాః
అర్థం :
ఒకే పరమాత్మ సాకారమగును , నిరాకారమగును ఉండుటవలన సగుణధ్యానమునకు గానీ , నిర్గుణధ్యానమునకు గాని , లక్ష్యముఒకటియే అయియున్నది. శ్రద్ధతోను , నిర్మలభక్తి తోను యే ప్రకారము ధ్యానించినను జనులు పరమాత్మనే చేరుదురు. ఈ రెండు శ్లోకములందును నిర్గుణపరబ్రహ్మమును ధ్యానించువారిని గుఱించి చెప్పబడినది . ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చినవి శేషణ మూలున్ను , రెండవ శ్లోకమునభ్రహ్మ ప్రాప్తి కి వలసిన శీలసంపత్తి యు తెలుపబడినవి . సాధకుడు సాధ్యవస్తువగు పరమాత్మను ధ్యానించుచున్నపటికిని , హృదయశుద్ధి లేనిచో , ఇంద్రియనిగ్రహముగల్గియుండనిచో , ప్రాణికోట్ల యెడల దయ లేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టి వానికి బ్రాహ్మానుభూతికలుగుట దుస్తరము . అతని ఉపాసన కళాయి లేని పాత్రలో వండిన పప్పుపులు సువలె నుండును . వస్తువులన్నియు మంచివి అయినను పాత్రశుద్ధముగా లేనిచో ఆపులు సెట్లు చిలుమెక్కి పోయి నిరుపయోగ మగునో , అట్లె హృదయశుద్ధి , ఇంద్రియనిగ్రహము , భూతదయమున్నగు పవిత్రగుణములు లేక భగవంతుని నిరాకారముగా గాని, సాకారముగ గాని యెట్లర్చిం చినను ఫలితము సూన్యమే యగును. కనుకనే గీతాచార్యుడు ధ్యానశీలురను హెచ్చరించుటకు కాబోలు, ధ్యాతకు వలసిన మూడు గొప్ప సుగుణములను ఇచ్చట నిర్గుణబ్రహ్మూపాసనాఘట్టమున పేర్కొనెను. అవి యేవియనిన ---
(1) ఇంద్రియ సమూహమును లెస్సగఅరికట్టుట ( సంనియ మ్యేన్ద్రియ యగ్రామం)
(2) ఎల్లెడల సమభావము గలిగియుండుట ( సర్వత్ర సమబుద్ధయః )
(3) సమస్త ప్రాణులకు హితమునాచరించుట ( సర్వభూతహి తేర తాః )
కాబట్టిముముక్షువులు ధ్యానాదులను సల్పుచు ఈ సుగుణత్రయమును బాగుగ అలవఱచుకొనవలెను . ఇచట ' నియమ్య ' అని చెప్పక ' సంనియమ్య ' అని చెప్పుటవలన ఇంద్రియములను ఒకింత నిగ్రహించిన చాలదనియు లెస్సగ నిగ్రహించవలెననియు , ' సర్వత్ర ' అని పేర్కొనుటవలన సమస్తప్రాణులందును , లేక ఏల్ల కాలమునందును , సమభావము గలిగియుండవలెననియు , ' సర్వభూతహి తేరతాః ' అని చెప్పుటచే ఏఒకానొక ప్రాణియెడల దయగలిగియుండుట చాలదనియు , సమస్తప్రాణికోట్లయెడ ప్రేమ , దయ , ఉపకార బుద్ధి , గలిగియుండ వలెననియు స్పష్టమగుచున్నది . ఈ ప్రకారములగు సుగుణములుగల్గి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను జేర గలరని ' తే ప్రాప్నువన్తి ' అను వాక్యముచే భగవానుడునిశ్చయ పూర్వకముగా తెలుపుచు సర్వులకును అభయ మొసంగుచున్నాడు . కావున భగవద్ధ్యానపరుడు పై మూడు సుగుణములను తనయందున్నవా , లేవా యని పరీక్షించుకొనవలయును .
సగుణనిర్గుణోపాసనల రెండిటిలో , నిర్గునిర్గుణోపాసన ( సామాన్యులకు ) కష్టతరమనియు , దేహభావన గలవారి కయ్యది బహుప్రయాసాగ నుండుననియు వచించుచున్నారు .
Comments
Post a Comment