భగవద్గిత శ్లోకం - Day 04 - భక్తి యోగము

భక్తి యోగము

క్లేసో ధిక తరస్తే షామవ్య క్తాస క్త చేత సామ్
అవ్యక్తా హి గతి ర్ధు: ఖం  దేహ వద్భి రవా ప్యతే 

 అర్థం :

కాబట్టి  సాధకులు మొట్టమొదటనే అవ్యక్త (నిరాకార ,నిర్గుణ ) మార్గమునకై పరువిడక , దేహాభిమానమును దోషమునుభగవదు పాసనా , నిష్కామక ర్మాద్య ను ష్టానముల  వలన తొలగించుకొని , ఇంద్రియనిగ్రహమును అభ్యసించి క్రమముగ నిర్గుణ పరబ్రహ్మమం చిత్తమును ప్రవేశింపజేసినచో  అ  త్తఱి ఏ ప్రయాస  లేకయే దైవ ప్రా ప్తి రూప లక్ష్యము సిద్దించగలదు . పరమార్థరంగమున ప్రవేశించి సాధకుల నేకులు బ్రహ్మమును గూర్చి ఉపాసనాదులు సలుపుచున్నాను ఉత్తమ ఫలితములను బొంద జాలకపోవుటకు కారణమీ శ్లోకమున చక్కగా తెలుపబడినది . క్షేత్రమును శుద్ధపచక విత్తనము వేసినచో ఏమిలాభము ? పునాదిగట్టిగ లేక మేడ కట్టినచో నిలుచునా ? అట్లేహృదయ మందలి దేహాభిమానము మున్న గునవి తొలగనిచో బ్రహ్మమందు మనస్సు నిలువదు . సాధకులీవిషయమును బాగుగ జ్ఞప్తియందుంచుకొనవలెను . వాస్తవముగ ధ్యానము గాని , ఉపాసనగాని ఎంతయో ఆనందకరమైన పరిస్థితి . అది సచ్చిదానందసాగరమును గూర్చిన విషయము కదా! అందు కష్టమెందులకుండును ? అది ప్రయాసను పోగొట్టునదే కాని , కలుగజేయునది కాదు . కాని జనులు దానిని ఆచరించుపద్దతిని తెలుసుకొనజాలక దేహాభిమానవశమున కష్టమనుభవించుచున్నారు . కావున సగుణోపాసమున కొంతకాలము మెలిగి , దేహాభిమానమును పోగోట్టుకొని తదుపరి నిర్గుణోపాసన నవలంబించుట ఉత్తమోత్తమము  

Comments

Popular posts from this blog

భగవద్గిత శ్లోకం - Day 02 - భక్తి యోగము

భగవద్గిత శ్లోకం - Day 03 - భక్తి యోగము