భగవద్గిత శ్లోకం - Day 02 - భక్తి యోగము



భక్తి యోగము
శ్రీ భగవానువాచ  :- 

మయ్యా వేశ్య  మనో  యే  మాం  నిత్యయుక్తా ఉపాసతే 
శ్రద్ధయా  పరాయో  పేతస్తే మే  యుక్త తమా  మతాః  


అర్థం :
అర్జునుని  ప్రశ్నకు  భగవానుడు చక్కటిసమాధాన మొసంగెను. సగుణోపాసకులు శ్రేష్ఠులా , నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా యను  ప్రశ్న కు ఎవరైనను సరియే మిక్కిలిశ్రద్ధ తో గూడుకొని నిరంతరము దైవాయ త్తచిత్తులై యుండుచోవారే  శ్రేష్ఠులని  శ్రీ కృష్ణుడు ప్రత్యుత్తర మొసంగెను . ఇచట మూడుసాధనలు  చెప్పబడెను . 
(1) మనస్సును పరమాత్మయందు నిలుపుట . 
(2) నిరంతరము దైవచింతనాపరులై యుండుట. 
(3) మిక్కిలి శ్రద్ధతో  గూడుకొనియుండుట . 

ఈ మూడింటిని అనుష్టించువాడెవడో వాడే సర్వశ్రేష్ఠుడగు యోగిగాని, సగుణో పాసకుడా , నిర్గుణోపాసకుడా , సన్నాసియా , గృహస్తుడా , ద్విజుడా , అంత్యజుడా -- అను ప్రశ్నయే ఇచట లేదు. ఆహా ! భాగవానుడెట్టి విశాలభావమును ప్రకటించెను ! భక్తికి , శ్రద్ధకు , ఏకాగ్రతకు ప్రాధాన్యమోసంగెనేకాని ఒకానొక మార్గమునకు , సంప్రదాయమునకుగాదు.       

Comments

Popular posts from this blog

భగవద్గిత శ్లోకం - Day 04 - భక్తి యోగము

భగవద్గిత శ్లోకం - Day 03 - భక్తి యోగము