Posts

భగవద్గిత శ్లోకం - Day 04 - భక్తి యోగము

భక్తి యోగము క్లేసో ధిక తరస్తే షామవ్య క్తాస క్త చేత సామ్ అవ్యక్తా హి గతి ర్ధు: ఖం  దేహ వద్భి రవా ప్యతే   అర్థం : కాబట్టి  సాధకులు మొట్టమొదటనే అవ్యక్త (నిరాకార ,నిర్గుణ ) మార్గమునకై పరువిడక , దేహాభిమానమును దోషమునుభగవదు పాసనా , నిష్కామక ర్మాద్య ను ష్టానముల  వలన తొలగించుకొని , ఇంద్రియనిగ్రహమును అభ్యసించి క్రమముగ నిర్గుణ పరబ్రహ్మమం చిత్తమును ప్రవేశింపజేసినచో  అ  త్తఱి ఏ ప్రయాస   లేకయే దైవ ప్రా ప్తి రూప లక్ష్యము సిద్దించగలదు . పరమార్థరంగమున ప్రవేశించి సాధకుల నేకులు బ్రహ్మమును గూర్చి ఉపాసనాదులు సలుపుచున్నాను ఉత్తమ ఫలితములను బొంద జాలకపోవుటకు కారణమీ శ్లోకమున చక్కగా తెలుపబడినది . క్షేత్రమును శుద్ధప ఱ చక విత్తనము వేసినచో ఏమిలాభము ? పునాదిగట్టిగ లేక మేడ కట్టినచో నిలుచునా ? అట్లేహృదయ మందలి దేహాభిమానము మున్న గునవి తొలగనిచో బ్రహ్మమందు మనస్సు నిలువదు . సాధకులీవిషయమును బాగుగ జ్ఞప్తియందుంచుకొనవలెను . వాస్తవముగ ధ్యానము గాని , ఉపాసనగాని ఎంతయో ఆనందకరమైన పరిస్థితి . అది సచ్చిదానందసాగరమును గూర్చిన విషయము కదా! అందు కష్టమెందులకుండును ? అది ప్రయాసను పోగొట...

భగవద్గిత శ్లోకం - Day 03 - భక్తి యోగము

భక్తి యోగము : 3. యే త్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే  సర్వత్ర గమ చిన్త్యం  చ కూటస్థ మచలం ధ్రువం.  4. సంనియ మ్యేన్ద్రి యగ్రామం సర్వత్ర సమబుద్ధయః  తే ప్రాప్నువన్తి  మాయేవ సర్వభూత హితే రతాః   అర్థం : ఒకే  పరమాత్మ  సాకారమగును , నిరాకారమగును ఉండుటవలన సగుణధ్యానమునకు గానీ , నిర్గుణధ్యానమునకు గాని , లక్ష్యముఒకటియే అయియున్నది. శ్రద్ధతోను , నిర్మలభక్తి తోను  యే  ప్రకారము ధ్యానించినను జనులు పరమాత్మనే చేరుదురు. ఈ రెండు శ్లోకములందును నిర్గుణపరబ్రహ్మమును ధ్యానించువారిని గుఱించి చెప్పబడినది . ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చినవి శేషణ మూలున్ను , రెండవ శ్లోకమునభ్రహ్మ ప్రాప్తి కి వలసిన శీలసంపత్తి యు  తెలుపబడినవి . సాధకుడు సాధ్యవస్తువగు పరమాత్మను ధ్యానించుచున్నపటికిని , హృదయశుద్ధి లేనిచో , ఇంద్రియనిగ్రహముగల్గియుండనిచో , ప్రాణికోట్ల యెడల దయ లేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టి వానికి బ్రాహ్మానుభూతికలుగుట దుస్తరము . అతని ఉపాసన కళాయి లేని పాత్రలో వండిన పప్పుపులు సువలె నుండును . వస్తువులన్నియు మంచివి అయినను ప...

భగవద్గిత శ్లోకం - Day 02 - భక్తి యోగము

భక్తి యోగము శ్రీ భగవానువాచ  :-  మయ్యా వేశ్య  మనో  యే  మాం  నిత్యయుక్తా ఉపాసతే  శ్రద్ధయా  పరాయో  పేతస్తే మే  యుక్త తమా  మతాః   అర్థం : అర్జునుని  ప్రశ్నకు  భగవానుడు చక్కటిసమాధాన మొసంగెను. సగుణోపాసకులు శ్రేష్ఠులా , నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా యను  ప్రశ్న కు ఎవరైనను సరియే మిక్కిలిశ్రద్ధ తో గూడుకొని నిరంతరము దైవాయ త్తచిత్తులై యుండుచోవారే  శ్రేష్ఠులని  శ్రీ కృష్ణుడు ప్రత్యుత్తర మొసంగెను . ఇచట మూడుసాధనలు  చెప్పబడెను .  (1) మనస్సును పరమాత్మయందు నిలుపుట .  (2) నిరంతరము దైవచింతనాపరులై యుండుట.  (3) మిక్కిలి శ్రద్ధతో  గూడుకొనియుండుట .  ఈ మూడింటిని అనుష్టించువాడెవడో వాడే సర్వశ్రేష్ఠుడగు యోగిగాని, సగుణో పాసకుడా , నిర్గుణోపాసకుడా , సన్నాసియా , గృహస్తుడా , ద్విజుడా , అంత్యజుడా -- అను ప్రశ్నయే ఇచట లేదు. ఆహా ! భాగవానుడెట్టి విశాలభావమును ప్రకటించెను ! భక్తికి , శ్రద్ధకు , ఏకాగ్రతకు ప్రాధాన్యమోసంగెనేకాని ఒకానొక మార్గమునకు , సంప్రదాయమునకుగాదు.       ...

భగవద్గిత శ్లోకం - Day 01 - భక్తి యోగము

భక్తి యోగము - అర్జున ఉవాచ :- ఏవం సతత యుక్తా యే భక్తాస్త్వామ్ పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాo కే యోగవిత్త మాః . అర్థం : భగవానుని విశ్వరూపమునుగాని , లేక దైవ సంబంధమైన వేఱోక మూ ర్తి ని గానీ , సాకార స్వరూపమునుగాని , అనవరత భక్తితో , ఉపాసించువారు ( సగుణోపాసకులు ) గొప్పా ? లేక ఇంద్రియములకు గోచరముకాని , నిరాకారమైన , సర్వవ్యాపకమైన , అక్షర పరమాత్మను ధ్యానించువారు (నిర్గుణోపాసకులు) గొప్పా ?అని అర్జునుని ప్రశ్న ఇదివఱలో అనేక తూర్లుభగవానుడు నిర్గుణపరమాత్మయొక్క తత్వమునుగూర్చి , ధ్యానమును గూర్చి తెలిపియుండెను . ఇప్పుడు విశ్వరూపమునుజూపి , సగుణోపాసనను బలపఱచెను .